Kushi Movie Review : ‘ఖుషి’ మూవీ ఎలా ఉందంటే…?

(విడుదల తేదీ : 1, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు. దర్శకత్వం : శివ నిర్వాణ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్, సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ: మురళి.జి, ఎడిటర్: ప్రవీణ్ పూడి)

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా ఖుషి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నేడు ( 1, సెప్టెంబర్ 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…

కథలోకి : ఆరాధ్య (సమంత)ను చూసిన విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే.. ఇది గమనించిన ఆరాధ్య అతడిని దూరం పెట్టడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి తప్పించుకున్నా.. చివరకు విప్లవ్ తో ప్రేమలో పడుతుంది. అయితే వీరి ప్రేమకు ఆరాధ్య తండ్రి, ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) ససేమీరా అంగీకరించడు. అటు విప్లవ్ తండ్రి నాస్తికుడైన సత్యం (సచిన్ ఖేడేకర్) కూడా వీరి పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఎదిరించి విప్లవ్ – ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. మరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా సాగింది?, వీరి లైఫ్ లో జరిగిన ఊహించని మలుపులు ఏమిటి ?, చివరకు విప్లవ్ – ఆరాధ్య కథ ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. వీటికి తోడు ఫీల్ గుడ్ లవ్ సీన్స్ .. ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ టచింగ్స్ .. అలాగే డీసెంట్ గా అనిపించే నటీనటుల పనితీరు ఈ ‘ఖుషి’ చిత్రానికి హైలైట్స్ గా నిలిచాయి. ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ నాస్తికత్వానికి – భక్తికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. దర్శకుడు శివ నిర్వాణ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సాదాసీదాగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్ అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా ఉండి సోసో అనిపిస్తుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే సాగుతాయి.

మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. దర్శకుడు శివ నిర్వాణ రాసిన కథ, పాత్రలు కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఆద్యంతం ఆసక్తికమైన సన్నివేశాలతో సాగి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఓ ప్రవచన కర్త – ఓ నాస్తికుడి మధ్య జరిగిన సంఘర్షణ.. ప్రేమ కథలో కూడా కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. విజయ్ దేవరకొండ – సమంత కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. భర్త పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకునే నటనను కనబరిచాడు. పెళ్లి అయిన తర్వాత ఓ సగటు భర్తగా హుందాగా నటించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి జీవం పోశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హోమం సీక్వెన్స్ లో అలాగే సమంత వెళ్ళిపోయాక వచ్చే సన్నివేశంలో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కి – సమంతకి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కథానాయకగా నటించిన సమంత తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, విజయ్ దేవరకొండ – సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ, నాస్తికుడు సత్యంగా సచిన్ ఖేడేకర్ తమ సహజ నటనతో ఆద్యంతం తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో నటించిన రోహిణి, లక్ష్మిలకు ఆయా పాత్రలు కొట్టినపిండే. బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం : సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందుగా శివ నిర్వాణ దర్శకుడి గురించి చెప్పుకోవాలి. మంచి కథాంశంతో చక్కటి టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ప్రతీ సన్నివేశాన్ని ఆయన తెరకెక్కించిన తీరు వాహ్.. అనిపించింది. సంగీత దర్శకుడు హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు సూపర్ గా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ‘ఖుషి’ ఖుషీగా అలరిస్తూ వినోదంలో ముంచెత్తుతుంది.