Kishkindhapuri Movie Review: కిష్కిందపురి సినిమా రివ్యూ: థ్రిల్లర్, హారర్ అంశాలతో మెప్పించే ప్రయత్నం

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్, శాండీ మాస్టర్, హైపర్ ఆది, సుదర్శన్
దర్శకుడు: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాత: సాహు గారపాటి

సినిమా: కిష్కిందపురి (Kishkindhapuri)

విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ . అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

కథ:

రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో పనిచేస్తూ దెయ్యాలున్న ప్రాంతాలకు టూర్లు నిర్వహిస్తుంటారు. అలా ఒకసారి “సువర్ణ మాయ రేడియో స్టేషన్” అనే భయానక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలవుతుంది. ఆ రేడియో స్టేషన్‌లో ఏం జరిగింది? ఎందుకు ఆ స్థలానికి వెళ్లినవారు ప్రాణాలు కోల్పోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి, థ్రిల్లర్, హారర్ అంశాలను మేళవించి ఒక ఆసక్తికరమైన కథను చెప్పడానికి ప్రయత్నించారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులను కథనంలో లీనం చేయగలిగారు. మొదటి భాగంలో దెయ్యం ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం వేగంగా సాగి, ఇంటర్వెల్ ట్విస్ట్ తో మరింత ఆసక్తిని పెంచింది.

రెండో భాగంలో దెయ్యం బ్యాక్‌స్టోరీ ఆసక్తికరంగా ఉన్నా, కొన్ని లాజిక్స్ మిస్ అయినట్లు అనిపించాయి. అయితే, “దెయ్యం సినిమాలకు లాజిక్స్ ఏంటి?” అనే హైపర్ ఆది డైలాగ్ ఆ లోపాన్ని కప్పిపుచ్చింది. కొన్ని సన్నివేశాలు ఊహించదగినవిగా ఉన్నా, కొన్ని ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

నటీనటులు: రాఘవ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్‌ తన పాత్రలో ఆకట్టుకోగా, శాండీ మాస్టర్ తన ‘విశ్వరూప పుత్ర’ పాత్రతో సినిమాకే హైలైట్‌గా నిలిచాడు. హైపర్ ఆది, సుదర్శన్‌ తమ కామెడీతో అలరించారు.

టెక్నికల్ టీమ్: ఈ సినిమాకి నిజమైన హీరో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్. హారర్ సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. రన్‌టైమ్ కూడా ప్రేక్షకులకు అనుకూలంగా ఉంది.

హైలైట్స్:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన

చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం

ఊహించని ట్విస్టులు

సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

తీర్పు:

మొత్తంగా, ‘కిష్కిందపురి’ సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. సాధారణ కథనంతో ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన ట్విస్టులు, చైతన్ భరద్వాజ్ సంగీతం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన సినిమాను చూడదగినదిగా మార్చాయి. థ్రిల్లర్, హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడవచ్చు.

రేటింగ్: 3/5

Kishkindhapuri Movie Review By Journalist Bharadwaj | Telugu Rajyam