విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

 

‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో ‘లీలై’ అనే రోమాంటిక్ కామెడీ తీశాడు. అది విజయం సాధించినా రెండో సినిమా కోసం చాలా స్ట్రగుల్ చేశాడు.ఇప్పుడు ‘కిల్లర్’ తనకే కాకుండా విజయ్ అంటోనీకీ ప్లస్ కావాలి. అవుతుందా? తొలిసారిగా విజయ్ అంటోనీ ఇంకో స్టార్ (అర్జున్) తో కలిసి నటించడం ఈ థ్రిల్లర్ కి ఒకఎట్రాక్షన్ అయితే, ట్రైలర్ ఏం చెప్తోందో చూద్దాం. విజయ్ అంటోనీ వరుసగా నటించిన యమన్, బేతాళుడు, ఇంద్రసేన అనే మూడు డార్క్ మూవీస్ లాగే ఇదింకో డార్క్మూవీ అన్నట్టు తెలుస్తోంది.

ఈ ట్రైలర్ ని ట్రైలర్ కోసం కథగా కట్ చేశారు. కిల్లర్ గా లొంగిపోయిన విజయ్ ఆంటోనీని అర్జున్ చేసే ఇంటరాగేషన్ అనే బేస్ తీసుకుని, దీనాధారంగా కథ రివీల్చేస్తూ ట్రైలర్ కట్ చేశారు. విజయ్ అంటోనీ పోలీసులేం చేస్తున్నారో తెలుసుకుని ఒకడుగు ముందుండే ఇంటలిజెంట్ కిల్లర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అర్జున్ ప్రశ్నిస్తూంటేవిజయ్ అంటోనీ పాయింటాఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు, మాంటేజెస్ రూపంలో ఫ్లాష్ కట్స్ చూపించారు. వాటిలో హీరోయిన్ తో ‘చంపొద్దె చంపొద్దె’ డ్యూయెట్ వేశారు.ఇలా ఎడారి బ్యాక్ డ్రాప్ లో లవ్ ఎస్టాబ్లిష్ చేశాక, హీరోయిన్ ఆందోళన చూపించారు, హత్యలు చూపించారు, నాజర్ తో- ‘ఐతే అతడు ఇదంతా చేసింది ఆ అమ్మాయి మీదఅతడి కున్న ప్రేమ కోసమా?’ అని చెప్పించి మనకి క్లూ ఇచ్చారు. మళ్ళీ ప్రెజెంట్ లో ఇంటరాగేషన్ కొచ్చి ‘ఎన్నిహత్యలు చేయడానికైనా రెడీ’ అని విజయ్ ఆంటోనీ చేతపలికించారు. సైకోలా వున్నాడని ఒక పోలీసు అనే పంచ్ తో ఎండ్ ఇచ్చారు.

అంటే సైకో అయిన విజయ్ అంటోనీ ప్రేమించిన హీరోయిన్ కోసం హత్యలు చేసే సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమవుతోంది. రొటీన్ సీరియల్ కిల్లర్ కథే. అయితే ఎందుకుచంపుతున్నాడో ఈ ట్రైలర్ క్లూ అందిస్తున్నా, ఎవర్ని చంపుతున్నాడనేది సస్పెన్స్ గా వుంది. ఇంకో సస్పెన్స్ ఏమిటంటే – ‘అతను చెప్తున్న విషయాలన్నీ ఊహించుకునిచెప్తున్నవే’ అని సైకియాట్రిస్టుతో అన్పించడం. ఈ సస్పెన్సే ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలి. హీరోయిన్ కోసం ఎందుకని విజయ్ అంటోనీ కిల్లర్ గా మారాడన్న కారణంకూడా కొత్తగా, బలంగా, ఎమోషనల్ గా వుంటే మూవీకి ప్రేక్షకులు బిగ్ హేండ్ ఇచ్చే అవకాశముంది. అలాగే విజయ్ అంటోనీ, అర్జున్ ల మధ్య టాం అండ్ జెర్రీ ఎత్తుగడలయాక్షన్ ఎపిసోడ్స్ కూడా వుంటే మంచి థ్రిల్లర్ అన్పించుకునే అవకాశముంది. సీన్స్ లో రెడ్ టింట్ ప్రధానంగా వుంది హత్యలకి సింబాలిక్ గా. హీరోయిన్ గా అషిమానర్వాల్ నటించింది. ఈమె మిస్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా గ్లోబల్ బ్యూటీ అవార్దులు పొందిన ఆస్త్రేలియన్ మోడల్. ఇటీవలే ‘నాటకం’, ‘జెస్సీ’ అనే రెండు తెలుగుసినిమాల్లో నటించి సినిమా కెరీర్ ని ప్రారంభించింది.

‘కిల్లర్’ టైటిల్ లో మాత్రం కిక్ లేదు. ఎన్నోసార్లు వాడేసిన టైటిల్ ఇది. పైగా ట్యాగ్ లైన్ గా ‘హంతకుడు’ అని పెట్టారు. కిల్లర్ అంటే ఏమిటో అర్ధం చెప్పడం కంటే వేరేక్రియేటివ్ ట్యాగ్ లైన్ సాధ్యం కాలేదేమో. సైమన్ కింగ్ సంగీతం, ముఖేష్ ఛాయగ్రహణం నిర్వహించిన ‘కిల్లర్’ ని, పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ లు విడుదల చేస్తున్నారు. జూన్ 5 న విడుదలవుతుంది.

Bottom Line – ఆ సస్పెన్స్ కే టికెట్లు తెగాలి!

 

https://www.youtube.com/watch?v=UlsHdNFvgoY

<

p style=”font-weight: 400; text-align: justify;”>―సికిందర్