గుడ్‌న్యూస్.. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాము రిజర్వేషన్‌ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించవచ్చని భెల్‌ డిపో మేనేజర్‌ సత్యనారాయణ తెలిపారు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు అంటే.. విశాఖపట్టణం, కాకినాడ, విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, భద్రాచలం, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు హైదరాబాద్‌ నుండి వెళ్లేవారు ఈ అవకాశం పొందవచ్చన్నారు. టీఎస్‌ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.