ఈ టిఆర్ఎస్ ఎంపిపి ఎట్ల తిడుతుండో వినురి (ఆడియో)

తెలంగాణలో అధికార పార్టీ నేతలు అక్కడొకరు ఇక్కడొకరు రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. ఫోన్లలో జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఏకంగా పార్టీ అధినేత నుంచే ఆదేశాలున్నాయి. అయినప్పటికీ కొందరు లోకల్ లీడర్లు కొన్నిసార్లు హద్దుమీరి మాట్లాడుతున్నారు. అధికారులను గలీజ్ మాటలతో తిడుతూ భయపెడుతున్నారు. ఆ ఫోన్ రికార్డింగ్ లు బయటకు రావడంతో వాళ్లు కూడా అభాసుపాలవుతున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలాధ్యక్షుడు (ఎంపిపిి) అదే మండలానికి చెందిన ఇన్ ఛార్జి ఎంపిడిఓ ను ఫోన్లో బూతు తిట్లు తిట్టాడు. ఆ తిట్ల ఆడియో ఇప్పుడు కరీంనగర్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కరీంనగర్ ను దాటుకుని రాష్ట్రమంతా పాకింది. ఇంత గలీజ్ గ మాట్లాడుతున్నడేంది ఈ టిఆర్ఎస్ నాయకుడు అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

బాలా గౌడ్ అనే ఎంపిపి గంగాధర మండలానికి ఇన్ఛార్జి ఎంపిడిఓ గా ఉన్న బండు ను ఎట్ల తిడుతున్నడో కింద ఫోన్ ఆడియో ఉంది వినండి