ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చిన్నగురిజాలలో ఆదివారం చోటుచేసుకుంది. గురిజాల గ్రామానికి చెందిన వెంగలరాజు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోజనానికి వెళ్లే సమయంలో చెరువులో కాళ్లూ, చేతులు కడుక్కునేందుకు వెళ్ళారు.
అయితే కృష్ణమూర్తి ప్రమాదవశాత్తూ చెరువులోకి పడిపోగా.. ఆతన్ని రక్షించే క్రమంలో కొడుకు నాగరాజు, మనవడు దీపక్ (12) కూడా చేరువులో పడి మృతి చెందారు. పోలీసులకు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
చేరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలి
