TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బిఆర్ఎస్ నేతలు అలాగే కాంగ్రెస్ నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది అయితే తాజాగా టిఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడని.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై హరీష్ రావు స్పందించారు తాను కనుక కమిషన్స్ తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్ విసరడమే కాకుండా కొంతమంది మంత్రులు అసెంబ్లీకి తాగి వస్తున్నారని వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా సభ మొత్తం దద్దరిల్లింది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తిగా తప్పు పట్టారు.
ఈ క్రమంలో సభలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను తొలగించడానికి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఇలా బిఆర్ఎస్ నేతలు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య అసెంబ్లీలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా బిఆర్ఎస్ నేతలు కూడా సమాధానాలు ఇవ్వడం వారి కౌంటర్ కు రీ కౌంటర్ ఇవ్వడం చేస్తున్నారు.