TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ అరెస్టును సినీ సెలబ్రిటీలు అభిమానులు పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇక ఈయన అరెస్టు కావడం గాంధీ ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం తరలించడం అనంతరం కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
ఇలా రిమాండ్ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ పై కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అయితే అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించడంతో ఈయనకు హైకోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. ఇలా హైకోర్టు వెంటనే తనని విడుదల చేయాలి అంటు తీర్పు ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉంచుకొని ఉదయం విడుదల చేశారు ఇలా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ జైల్లో ఉంచారని ఆయన తరపు లాయర్లు వెల్లడించారు.
అల్లు అర్జున్ ఆలస్యంగా విడుదల కావడానికి పోలీసులే కారణమని, కావాలనే ఆలస్యం చేశారని అల్లు అర్జున్ తరఫు అడ్వొకేట్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.స్టార్ హీరోను ఆలస్యంగా రిలీజ్ చేయడంపై తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని తెలిపారు. వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని మండిపడ్డారు .ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అలా వ్యవహరించారని తెలిపారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని అడ్వకేట్ అశోక్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఇక బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు రావడంతో పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి ఎంతోమంది.
పోలీసులు కావాలనే ఆలస్యం చేశారు: అల్లు అర్జున్ అడ్వకేట్
సినీనటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవ్వడంపై తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని ఆయన తరఫు అడ్వకేట్ అశోక్ రెడ్డి అన్నారు. వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్… pic.twitter.com/LChMuqCq13
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024