Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడం పట్ల ఈయనపై కేసు నమోదు అయింది అయితే ఆ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ కు ఏ విధమైనటువంటి ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆమె మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఈయనపై కేసులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలోనే పోలీసులు తనని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయడం ఎలా వెంట వెంటనే అన్ని పూర్తి అయ్యాయి. ఇక తాజాగా తనని నాంపల్లి కోర్టులో హాజరపరచగా కోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడంతో పోలీసులు తనని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.
అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించే ముందు.. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు ప్రత్యక్షంగా సంబంధం లేదని.. తనపై ఉన్న FIR కొట్టివేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. కేసులో ఏ 11గా ఉన్నానని, ఈ కేసు విషయంలో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరఫున న్యాయవాది వాదించారు.
ఈ విషయంపై పోలీసులు సైతం బలంగా వాదనలు వినిపించారు. పోలీసుల అనుమతి లేకుండా థియేటర్ దగ్గరకు వచ్చారని.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని.. హీరో అల్లు అర్జున్ రావటం వల్లే ఒకరు చనిపోయారని.. దీనికి కారణం అల్లు అర్జున్ అంటూ పోలీసుల తరపు వాదనలు వినిపించారు లాయర్లు. ఇలా ఇద్దరి వాదనలు విన్న అనంతరం కోర్టు ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది దీంతో పోలీసులు అల్లు అర్జున్ చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు.