TG: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను వరుసగా అరెస్టు చేస్తున్న విషయం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గురువారం ఉదయం హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా అరెస్టు చేసిన ఈయనకు అర్ధరాత్రి బెయిల్ రావడంతో ఈయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
గురువారం ఉదయం 10:00 సమయంలో కౌశిక్ రెడ్డిని కొండాపూర్ లోని తన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయే దాకా పీఎస్‌లోనే నిర్బంధించారు. రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి.. రిమాండ్‌ను తిరస్కరించారు. రూ.5 వేలు జరిమాన ఇద్దరు పూచీకత్తుతో ఈయనకు బెయిల్ ఇచ్చారు.
ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల తన అక్రమ అరెస్టు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగానే తనని అరెస్టు చేశారని ఈ అక్రమ అరెస్టును తాను ఖండిస్తున్నానని తెలిపారు.. ఇక నా ఊపిరి ఉన్నంతవరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.హుజూరాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నారు. ప్రజల ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇక ఈయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా కౌశిక్ రెడ్డి అరెస్టుతో బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసులో కోర్టు బెయిల్ మంజూరు
ఈ కేసు పూర్తిగా కక్ష్యసాధింపు చర్యగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రజాసేవలో ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు తగదని న్యాయస్థానం… pic.twitter.com/pulK7Y1B0h
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) December 5, 2024