Telangana: తెలంగాణ సర్కార్ వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలు రోడ్డుపై తిరగాలి అంటే భారీ స్థాయిలోనే టాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో రోడ్డు రవాణా శాఖ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర రవాణా ఆదాయాన్ని పెంచే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే తెలంగాణలో కూడా రోడ్డు టాక్స్ లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పెట్రోల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్డు ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తులు నిర్వహిస్తున్నారని అలాగే పక్క రాష్ట్రాలతో అంచనాలు కూడా వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రోడ్డు రవాణా శాఖ ద్వారా ఆదాయం పెంచడం కోసం టాక్స్ పెంచబోతున్నట్లు సమాచారం. అయితే ట్యాక్స్ పెంచిన కూడా పక్క రాష్ట్రాల కంటే కూడా తక్కువగానే వసూలు చేయాలని నిర్ణయంలో తెలంగాణ సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘానికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ రోడ్డు టాక్స్ పెంచితే లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరలు ఉన్న బైకులు, 10 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్డు టాక్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక రోడ్డు రవాణా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు 7000 కోట్ల ఆదాయం ఉంది. అయితే ట్యాక్స్ కనుక పెంచితే 8 నుంచి 9 కోట్ల వేల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా వాహనదారులకు టాక్స్ ల రూపంలో రేవంత్ సర్కార్ త్వరలోనే బిగ్ షాక్ ఇవ్వబోతుందని చెప్పాలి.