రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జర్నలిస్టుకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జర్నలిస్టు ఒకరు గాయపడ్డారు. హైదరాబాద్ లోని రామాంతపూర్ లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

మోర్తాల నర్సింగరావు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి రిపోర్టర్ గా హైదరాబాద్ స్టేట్ బ్యూరో లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం రామంతపూర్ లో తన మామతో కలిసి షాప్ కు వచ్చారు నర్సింగరావు. షాప్ లో కొనుగోలు చేయాల్సినవి చేసిన తర్వాత తిరిగి బయటకు వచ్చారు. అదే సమయంలో తన బైక్ వద్దకు వెళ్తున్న సందర్భంలో ట్రాలీ ఆటో ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వస్తున్నది. 

చికిత్స పొందుతున్న నర్సింగ రావు

సడెన్ గా ఆ ఆటో నర్సింగరావును ఢీకొట్టింది. దీంతో ఆయన కింద పడ్డారు. ఛాతికి బలంగా ఆటో ఢీకొట్టడంతో చాతికి గాయాలయ్యాయి. కింద పడగానే తలకు కూడా గాయమైంది. వెంటనే 108 అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న మ్యాట్రిక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నర్సింగరావు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆపరేషన్ చేసిన డాక్టర్లు తల గాయానికి మూడు కుట్లు వేశారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం నర్సింహ్మారావు కోలుకుంటున్నట్లు సహచర జర్నలిస్టులు తెలిపారు. వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఒక్కసారిగా ఢీకొట్టడంతో నర్సింగరావు షాక్ కు గురయ్యారు. ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. 

మోర్తాల నర్సింగరావు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు అంతకముందు జనగామలో పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నర్సింగరావు క్రియాశీలక పాత్ర పోశించారు. తెలంగాణ కోసం జర్నలిస్టులు జరిపిన అన్ని పోరాటాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  నర్సింగరావు త్వరగా కోలుకోవాలని పలువురు జర్నలిస్టులు ఆకాంక్షించారు.