టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు.
జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురంలో పర్యటించిన లోకేశ్.. అక్కడ ట్రాక్టర్ ను నడిపారు. అయితే.. లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి.. పక్కనే ఉన్న ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది.
అయితే.. లోకేశ్ ట్రాక్టర్ నడుపుతుండగా.. పక్కన కూర్చున్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమయి ట్రాక్టర్ ను అదుపు చేశారు. లేకపోతే మరింత ప్రమాదం జరిగి ఉండేది.
వెంటనే లోకేశ్ ట్రాక్టర్ నుంచి కిందికి దిగారు. అయితే.. లోకేశ్ కు ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదు. లోకేశ్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.