Telangana: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తో ఈటెల రాజేంద్రనాథ్ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చర్చలకు కారణమైంది. గతంలో బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ భూ వివాదంలో సొంత పార్టీ నేతలతోనే వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ సైతం ఈయనపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో రాజేంద్రనాథ్ తన సొంత పార్టీకి గుడ్ బై చెబుతూ బిజెపి పార్టీలోకి చేరారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుడి భుజంగా రాజేంద్రనాథ్ వ్యవహరించారు ఆయన హయాంలో వైద్య ఆర్థిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న ఈటెల ఈ భూ వివాదాల కారణంగా తన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా కమలం చెంతకు చేరిన ఈటెల జుహూరాబాద్ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు ఇక ప్రస్తుతం ఈయన ఎంపీగా కూడా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బీజేపీ పార్టీలో ఎంపీగా కొనసాగుతున్న ఈటెల ఆ పార్టీలో కొనసాగడం ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అందుకే తిరిగి సొంతగూటికి చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈటెల తిరిగి బిఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలోనే ఈయన మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి దిగిన ఫోటో ఒకటి చెక్కర్లు కొట్టడంతో ఈయన అతి త్వరలోనే సొంతగూటికి రాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఈటెల రాజేంద్రనాథ్ పార్టీ మారడం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంతమంది బిఆర్ఎస్ నేతలు కూడా ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం తెలిసిందే .ఇలాంటి తరుణంలో ఈటెల తిరిగి బిఆర్ఎస్ చెంతకు రాబోతున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చలకు కారణమైంది.