హైదరాబాద్ లో ఐకియా భూకంపం (వీడియో)

స్వీడిష్ ఫర్నిచర్ తయారీ బాహుబలి ఐకియా నిన్న హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది.

ఈ కంపెనీ  భారతదేశపు తొలిషోరూం హైదరాబాద్ లో ప్రారంభించింది. తర్వాత ముంబాయి, బెంగుళూరు ఢిల్లీలలో కూడా దుకాణాలు తెరుస్తుంది.  హైదరాబాద్ లో షోరూం పెట్టడానికి ముందుకు నగరంలో 700 మంది ఇళ్లలో భారతీయుల జీవన శైలిని ఐకియా అధ్యయనం చేసిందట. ఈ ఐకియా మాల్ ప్రారంభంకాగానే, హైదరాబాదీయులు విరగబడి చూశారు.

హైదరాబాద్ చరిత్రలో ఒక మార్కెట్ లోకి ఇలా జనం వేలం వెర్రిగా వచ్చిన దాఖలా లేదు.  ఏ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ రోజు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్షణాన కూడా ఇంతగా జనం విరగబడి రోడ్ల మీదకు రాలేదు. ఇక మళ్ళీ ఈ అవకాశం రాదేమో అన్నంతగా జనం పోటీ పడ్డారు. ఫోటోలు, వీడియో చూడండి.