సాధారణంగా ఎన్టీయార్ ట్రస్టు భవన్ లో కాంగ్రెస్ నేతలను చూడలేం. ఇపుడు పరిస్థితులు మారడంతో ఎన్టీయార్ ట్రస్టు భవన్ లోకి కాంగ్రెస్ నేతల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈరోజు వ్యవూహాత్మకంగా ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఎన్టీయార్ ట్రస్టు భవన్ కువచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా నామినేషన్ వేశాక డాక్టర్ శ్రవణ్ దాసోజు అక్కడి రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చకోవడం మొదలుపెట్టారు. ఈ పని మీదే ఆయన ఎన్టీయార్ ట్రస్టు భవన్ కు వెళ్లారు. అక్కడ ఎన్ మొదట ఆయన తెలుగుదేశం పార్టీ రెబెల్ క్యాండిడేట్ తో సంప్రదింపులు మొదలుపెట్టి ఆయన తన వైపు తిప్పుకోవడంలో విజయవంతం మయ్యారు. ఫలితంగా టీటీడిపి రెబెల్ అభ్యర్ధి బీఎన్ రెడ్డి శ్రవణ్ కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో టీటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రవణ్ కు మద్దతుగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఆయన శ్రవణ్ గెలుపుకోసం క్యాంపెయిన్ కూడా మొదలుపెడుతున్నారు. మహాకూటమి తరుఫున బరిలో నిలిచిన డాక్టర్ శ్రవణ్ దాసోజు కు టీడిపి కార్యకర్తలు కృషిచేయాలని బీఎన్ రెడ్డి టీడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.శ్రవణ్ ను శాలువాతో సన్మానించారు. బిఎన్ రెడ్డితో పాటు దీపక్ రెడ్డి తదితర సీనియర్ టీటిడిపి నేతలు శ్రవణ్ కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
బీఎస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ శ్రవణ్
ఖైరతాబాద్ నియోజకవర్గం లో ప్రజాకూటమి తరుఫున బరిలో ఉన్న తనకు మద్దతు పలికిన బిఎన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకూటమి అభ్యర్ధిగా తన గెలుపుకు కృషి చేయాలని విజ్నప్తిచేశారు. ఈకార్యక్రమంలో టీటీడిపి సీనియర్ నేతలు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డిలు పాల్గొన్నారు.