వైఎస్సార్టీపీ అధినేత షర్మిల కేసీఆర్ సర్కార్ పై విమర్శల విషయంలో దూకుడు పెంచారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన షర్మిల సీబీఐకు కేసీఆర్ కుటుంబం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. షర్మిల కేసీఆర్ గురించి విమర్శలు చేయడం కొత్తేం కాదు. కేసీఆర్ ను విమర్శించడం ద్వారా తమ పార్టీపై ఇతరుల దృష్టి పడుతుందని ఆమె భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే కేసీఆర్ సర్కార్ పై ఫిర్యాదు చేసే సమయంలో షర్మిల చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక చెల్లిగా జగన్ కు ఎంత చేయాలో నేను చేశానని ఇంకా చెప్పాలంటే చేయాల్సిన దానితో పోల్చి చూస్తే నేను ఎక్కువే చేశానని ఆమె వెల్లడించడం గమనార్హం. కానీ నేనేదో చేశానని అవతలి వాళ్లు కూడా నాకు ప్రత్యుపకారం చేయాలని భావించలేదని షర్మిల కామెంట్లు చేయడం గమనార్హం.
ఒకవేళ వాళ్ల నుంచి నేను అలా ఆశిస్తే అది స్వార్థమే అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ సర్కార్ పై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి స్పందిస్తూ ఏపీలో అవినీతికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవినీతి గురించి అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుందని షర్మిల చెప్పుకొచ్చారు.
షర్మిల తన కామెంట్లతో జగన్ కు ప్రయోజనం చేకూరేలా తాను ఎంతో చేశానని అయితే ప్రతిఫలంగా తనకు ఏమీ లెక్కలేదని భావనను కలిగి ఉన్నారని చెప్పకనే చెప్పేశారు. జగన్ మాత్రం షర్మిల గురించి కానీ షర్మిల పార్టీ గురించి కానీ మాట్లాడటానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. షర్మిల విషయంలో జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.