Revantha Reddy: కేటీఆర్ కు ఆ ఛాన్స్ లేదు.. నెక్స్ట్ సీఎం కవితనే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revantha Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంటారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా జైలుకు వెళ్లి వచ్చిన వారు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఓటుకు నోటు కేసులో భాగంగా అరెస్ట్ అయి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గెలుపొందారు.

ఈ క్రమంలోనే ఇలా జైలుకు వెళ్లి వచ్చిన వారు ముఖ్యమంత్రులు అవుతున్నారని, తాను కూడా జైలుకు వెళ్లి వస్తే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలో కేటీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నాపై ఎన్ని కేసులు పెట్టిన అరెస్టుకు తాను సిద్ధంగానే ఉన్నానని కేసులకు భయపడేది లేదంటూ పలు సందర్భాలలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజంగానే జైలుకు వెళ్లి వచ్చిన వారు ముఖ్యమంత్రులు అవుతారు అనే లాజిక్ నిజమైతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక నెరవేరదని ఈ లెక్కన నెక్స్ట్ సీఎం కవిత అవుతారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ కుటుంబంలో ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా కవిత జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ అదే లాజిక్ నిజమైతే కవిత ముఖ్యమంత్రి అవుతారు కానీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కేటీఆర్ కి లేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి నన్ను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తారని నాకు తెలుసు అయినా తాను ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని ఒకవేళ రైతుల కోసమే నేను జైలుకు వెళ్లాల్సి వస్తే గర్వంగా జైలుకు పోతాను అంటూ గతంలో కేటీఆర్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

నెక్స్ట్ సీఎం కవిత..? | CM Revanth Reddy Shocking Comment's On MLC Kavitha & KTR | Disha TV