Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడాది పూర్తి కావస్తుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విజయోత్సవాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక విజయోత్సవాలు అంటే ఏడాది పాటు తమ హయామంలో జరిగిన అభివృద్ధిని చెప్పుకుంటూ భజన చేయడం మాత్రమే కాదు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ విజయోత్సవ కార్యక్రమాలను ఎంతో భిన్నంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ప్లాన్ చేశారు. విజయోత్సవాలు అంటే కేవలం భజన మాత్రమే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అని తెలియజేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తొమ్మిది రోజులపాటు ఈ విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవాల్లో మొదటి రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత వరుసగా మెడికల్, హైదరాబాద్ లో అభివృద్ధి పనులు, ఫారెస్ట్ డెవలప్మెంట్, ఇందిరా మహిళా శక్తి బజార్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ వంటివి ఉన్నాయి.
డిసెంబర్ తొమ్మిది తేదీన మాత్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన రోజు కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రజలలో పెంచుతూ తెలంగాణను ఇచ్చింది అలాగే తెలంగాణను తెచ్చింది కాంగ్రెస్ అని చాటి చెప్పనున్నారు. ఇక తొమ్మిదవ రోజు కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నారని మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విజయోత్సవాలను కాంగ్రెస్ విజయోత్సవాలు అని కాకుండా ప్రజా విజయోత్సవాలు అనే రీతిలో జరిపితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.