Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగోల్ల జిల్లా.. గట్టిగా డప్పులు కొట్టండి అంటూ రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు.
ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు .ఇలా రైతులు సంతోషంగా ఉంటే బిఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టదని రేవంత్ బి ఆర్ ఎస్ నేతలపై విమర్శలు కురిపించారు.స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా..? అని ప్రశ్నించారు. కుట్ర పూరితంగానే లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి చేశారని తెలిపారు.
ఇలా ప్రతి చోట అధికారులు దాడి చేస్తే ఇప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కట్టే వాళ్ళమా అంటూ ప్రశ్నించారు.సరిగ్గా 70 సంవత్సరాల తరువాత బూర్గుల తరువాత రైతు బిడ్డ మీ అభిమానంతో తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో నా జన్మ ధన్యమైందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతులే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. తాను పుట్టింది.. పెరిగింది నల్లమల్ల అడవుల్లో.. పులులు చూశా.. అడవిలో ఉండే మృగాలను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత.. నా కాలు గోటితో సమానం అంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగా బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతున్నాయి.