Revanth Reddy: చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. బన్నీ అరెస్టుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగింది అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమైన అని భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఉన్నఫలంగా అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లి తనని అరెస్టు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎంతో మంది బిఆర్ఎస్ నేతలు అల్లు అర్జున్ కి మద్దతుగా నిలబడి రేవంత్ రెడ్డి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. అలా మహిళా అభిమాని చనిపోయినందుకు అల్లు అర్జున్ అరెస్టు చేస్తే రేవంత్ రెడ్డిని కూడా ఈపాటికి ఎన్నోసార్లు అరెస్టు చేయాల్సి ఉండేదని తెలిపారు.

ఈ విధంగా బీఆర్ఎస్ నేతల నుంచి ఇలాంటి విమర్శలు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఈయన అల్లు అర్జున్ అరెస్టు గురించి స్పందిస్తూ.. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని తెలిపారు చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఈయన వెల్లడించారు. తొక్కిసలాటలో భాగంగా ఒకరు చనిపోవడంతోనే చట్టం తన పని తాను చేస్తుందని పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన చిట్ చాట్ ద్వారా మీడియాకు తెలియజేశారు.

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయం పొలిటికల్ పరంగా యూటర్న్ తీసుకుంటూ అన్ని పార్టీ నేతలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం రేవంత్ సర్కారు తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.