పట్నం ముఠాలు, పది పర్సెంట్ కమిషన్ : రేవంత్ రెడ్డి (వీడియోలు)

కొడంగల్ లో జరిగిన రోడ్ షో లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ట్రాన్స్ పోర్టు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సోదరుడు, కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

పట్నం సోదరులు షాబాద్ లో ఏ పనిచేసినా పది పర్సెంట్ కమిషన్ తీసుకునే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. చివరకు పెండ్లి చేసుకున్నా కూడా మేము దావత్ చేసుకోవాలె అని పది పర్సెంట్ కమిషన్ కొట్టేసే రకాలు అని మండిపడ్డారు. 

గౌడ సోదరులు కల్లు గీసుకుని, యాదవులు గొర్లు పెంచుకుని, మాదిగ బిడ్డలు చెప్పులు కుట్టుకుంటుంటే కేసిఆర్ ఆయన బిడ్డలు మాత్రం రాజ్యమేలతారా అని నిలదీశారు. అటువంటి వారికి ఓట్లేయాలా అని ప్రశ్నించారు.

కేసిఆర్, ఆయన బిడ్డలు ముఖ్యమంత్రులు, మంత్రులు అయితే వారి తాబేదార్లయిన పట్నం ముఠాలు మంత్రులవుతారా అని ప్రశ్నించారు. కొడంగల్ లో రేవంత్ మాట్లాడిన హాట్ వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

పట్నం నరేందర్ రెడ్డి కంప చెట్టు లాంటోడు : రేవంత్ ఫైర్

కోస్గి సభలో టిఆర్ఎస్ కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై సూటి విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి కంప చెట్టు లాంటోడని మండిపడ్డారు. కొడంగల్ తులసీ వనంలో కంప చెట్టును పెరగనిస్తే ఏమైనా అక్కరకొస్తదా అని ప్రశ్నించారు. కంప చెట్టు కుచ్చుకోవడం తప్ప ఏమీటికీ పనికిరాదన్నారు. 

పట్నం నరేందర్ రెడ్డి ఏనాడైనా కొడంగల్ కు వచ్చి జనాలకు సేవ చేసిండా అని నిలదీశారు. జనాల సమస్యలపై ఏనాడైనా పని చేసిండా అని ప్రశ్నించారు. ఏకులా వచ్చి మేకైదామని చూస్తుండని, జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గంజాయి మొక్కలను, కలుపు మొక్కలను పీకేలాయని పిలుపునిచ్చారు.

కోస్గిలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఈసారి తనను గెలిపించాలని కోరారు రేవంత్. పట్నం నరేందర్ రెడ్డిని కంపచెట్టుతో పోలుస్తూ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.