కేసిఆర్ కు రేవంత్ రెడ్డి 24 గంటల డెడ్ లైన్

ఐటి సోదాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. మీడియా సమావేశంలో కేసిఆర్ ఫ్యామిలీపైనా విరుచుకుపడ్డారు. కేసిఆర్ దొడ్లో జీవాలు అంటూ కొందరు టిఆర్ఎస్ నేతలను పేరు పెట్టకుండానే చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదవండి.

గత మూడు నాలుగు రోజులుగా కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను ,కొద్ది మంది మీడియా సంస్థలతో నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్లో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. కెసిఆర్ దొడ్లోంచి వదిలిన ల వింత జంతువు నా పై అబద్ధాలు మీడియాకు చెబుతున్నాయి. ఇతర దేశాలలో బ్యాంక్ అకౌంట్లు తెరిచి అక్రమాలు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. 

ఇప్పుడున్న ఇల్లు స్థలం కూడా 1992లో కొనుగోలు చేశారు మా కుటుంబ సభ్యులు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో చూపిన ఆస్తులకు 2014 ఎన్నికల అఫిడవిట్ లో చూసిన ఆస్తులు ఒక్కటే. నాకు ఉన్న బిల్డింగ్ ను కిరాయికి ఇచ్చాను కానీ అక్కడ కిరాయికి ఉన్న వ్యక్తుల కంపెనీలు అన్ని నావే అని అంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఒకడు ఎంపీ అంటాడు సదువుకున్న అంటాడు. వాడు ఎదో మాట్లాడుతాడు (బాల్క సుమన్ ను ఉద్దేశించి పేరు లేకుండా). కేసీఆర్ తిని వదిలేస్తే  బొక్కలు తిని బ్రతికే వాళ్ళు కూడా నా గురుంచి మాట్లాడుతున్నారు. నా మామా ముందు నుండే కోటీశ్వరులు. వాళ్ల ఊర్లో ఎవరిని అడిగినా వారు ఆర్థిక శ్రీమంతులు అని చెబుతారు.

చంద్ర శేఖర్ రావు మానసిక రోగంతో బాధపడుతున్నారు. నా పెళ్లి కంటే ముందు వారికి ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులు మీడియా మిత్రులు విశ్లేషించి చూడండి. ఎవడో ఒక్క రౌడీ షీటర్ త్వరలో పీడీ యాక్ట్ రాబోతుంది. వాడు కేటీఆర్ ను కలిస్తే నాకు మా నాన్నకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ మీద కేసు పెట్టమంటే పెట్టాడు తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. 

ఇతర దేశాలలో బ్యాంక్ అకౌంట్ తెరవాలి అంటే అక్కడి పౌర సత్వం ఉండాలి ,లేదంటే వారి నిబండలనకు మనం అర్హత ఉండాలి. ఒక పత్రికలో 1000 కోట్లు అని రాశారు (ఆంధ్రజ్యోతి గురించి). ఒకప్పుడు పత్రికలు రాసిన తరువాత అమ్మేవారు, ఇప్పుడు అమ్ముడబోయిన తరువాత రాస్తున్నారు. బ్రహ్మానందం ఒక సినిమా దుకుడులో నటించినట్టు నటిస్తున్నారు పాత్రికేయులు. కేవలం చంద్ర శేఖర్ రావును సంతోష పెట్టడానికి నా పై కత్తి తీసుకొని కడుపులో పొడుస్తానంటే ఎలా అని మీడియా మిత్రులను అడుగుతున్న.

కనీసం కాపీ కొట్టడానికైనా మెదడు ఉపయోగించాలి కదా. నాకు ఎదిరించి నిలబడే శక్తి ఉంది, వివరించే ఓపిక ఉంది. కేసీఆర్ ఒక సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా నిన్ను అపరేషన్న్ బ్లూ స్టార్ చేస్తా అన్న మాట నిజం కాదా? కేసీఆర్, టీఆరెస్ పార్టీ నాయకులు ఎందుకు నా కళ్ళలోకి చూడటానికి కూడా భయపడుతున్నారు. కేసీఆర్ అక్రమ ఆస్తులు బయట పెడుతూ ప్రచారం చేస్తున్నాను అని ఈ రోజు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి గౌరవించి కార్య నిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి నాలుగు నెలలు జైల్లో పెట్టాలని కేసీఆర్ ,మోడీ తో కుట్ర చేస్తున్నాడు. నా పై ఉన్న విశ్వసనీయత మీద బురద చల్లాలని కేసీఆర్ కుట్ర. టీఆర్ఎస్ పార్టీ ఒడిపోతుంది అని సర్వేల్లో రావడంతో కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి కుట్ర చేస్తున్నాడు. 

కేసీఆర్ వదిలిన బాణం,అందులో ఇంధనం రమేశ్వర్ రావు. కేసీఆర్ ఈ రోజు రెడ్లు వర్సెస్ వెలమ అనే కులాల మధ్య పంచాయతీ గా చిత్రికరిస్తున్నారు. నువ్వు నన్ను అండమాన్ జైల్లో పెట్టినా నీ పై నీ బంధువుల అవినీతిపై నిలబడి పోరాటం.చేస్తా. తెలంగాణలో ప్రతి తలుపు, ప్రతి వ్యక్తి గుండె తడతా. నీ అవినీతి వివరిస్తా.

కేసీఆర్ కు నా సవాల్

2001 నుండి ఇప్పటి వరకు నీ, నీ కుటుంబ సభ్యుల ఆస్తులపైన, నా ఆస్తులపై, అప్పులపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు సిద్ధమా? మనం ఇద్దరం కలిసి మోడీకి లేక రాద్దాం. మన ఇద్దరి నీతి ఏంది ఒక సిట్టుంగ్ జడ్జ్ ద్వారా విచారణకు నిలబడదాం. నీకు ఓకేనా? 24 గంటలలో నువ్వు స్పందించక పోతే నువ్వు అవినీతిపరుడివే.