Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కష్టకాలంలో తాము అధికారం చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అప్పులు చేసి పెట్టారని, 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేసి వెళ్లిపోయారని గత ప్రభుత్వం గురించి మండిపడ్డారు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వానికి పూర్తిగా ఆదాయం తగ్గిపోవడం వల్లే కొన్ని సమస్యలను తాము పరిష్కరించలేకపోతున్నామని ఈయన తెలిపారు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇతర ఖర్చులతో కలుపుకొని రాష్ట్రానికి సుమారు 30 వేల కోట్ల రూపాయల వరకు అవసరం అవుతుంది కానీ ప్రభుత్వానికి ప్రతినెల వచ్చే ఆదాయం కేవలం 18,500 కోట్లు మాత్రమేనని ఈ డబ్బు ఏమాత్రం సరిపోదని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ ఆదాయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసమే ప్రతినెల రూ.6500కోట్లు ఖర్చు చేస్తున్న మరో 6,500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన రూ. 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల 22500 కోట్లు కావాలి. వచ్చే ఆదాయంతో పోలిస్తే మరో నాలుగు వేల కోట్లు అదనంగా రావాల్సి ఉంటుందని తెలిపారు.
ఇలా మనకు ఆదాయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే సంక్షేమ పథకాలను కేవలం అర్హులకు మాత్రమే అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం పెరగాలన్న పెంచిన ఆదాయం పెంచాలన్న అది పూర్తిగా మీ చేతులలోనే ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేపడుతున్నారు అసలు ధర్నాలు చేయకుండా సమస్యలను పరిష్కరించవచ్చు కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థపూరితం కోసం మిమ్మల్ని రెచ్చగొట్టి ధర్నాలకు పంపిస్తున్నారు అలాంటి వారి మాటలను నమ్మి మీరు ఊబిలోకి దిగవద్దని అలా చేస్తే నష్టపోయేది మీరే అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని నాకు ఉంది కానీ చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టులో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.