జోస్యం: కాంగ్రెస్‌-80, బీఆరెస్స్-25, మిగిలినవి బీజేపీకి?

ఒకపక్క కవిత లిక్కర్ స్కాం లో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి, మరో పక్క టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకుల వ్యవహారం. మరో పక్క పదోతరగతి పరీక్షల్లో కూడా లీకులు, మరోపక్క విపక్ష నేతల అక్రమ అరెస్టులు, ఇంకోపక్క అటకెక్కిన డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ, దానికితోడు నిత్యం వార్తల్లో నానుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి, రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్న బీఆరెస్స్ నేతలపై లైంగిక ఆరోపణలు, మంత్రులపై వస్తున్న భూకబ్జాల వార్తలు, అవి చాలవన్నట్లు ఆత్మీయ సమ్మేళనాలే వేదికగా వెలుగులోకి వస్తున్న అంతర్గత విభేదాలు… మొదలైన సమస్యలు ప్రస్తుతం బీఆరెస్స్ ను వేదిస్తున్నాయి!!

ఇవిచాలవా బీఆరెస్స్ పతనాని… ఇవి సరిపోవా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంటున్నారు టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అవును… తన పాదయాత్రల అనుభవాలను, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను.. ఫలితాలుగా అన్వయించి చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్!

ఇందులో భాగంగా… “రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పాదయాత్రలు చేసిన తర్వాత ప్రజల నాడి నాకు అర్థమైంది, 80% మంది ప్రజలు కేసీఆర్‌ ను ఓడించాలనే కసితో ఉన్నరు. ఫలితంగా కాంగ్రెస్ కు ఎవరితోనూ పొత్తు అవసరం లేకుండా సుమారు 80సీట్లు రానున్నాయి – కేసీఆర్ లెవెల్ 25సీట్లకు పడిపోబోతుంది” అంటూ జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.

ఇక, సర్వేలతో తనకు సంబంధం లేదని తెలిపిన… ప్రజల నాడే తనకు కొలమానం అని క్లారిటీ ఇస్తున్న రేవంత్… బీఆరెస్స్ తో పొత్తు వార్తలపై కూడా స్పందించారు. బీఅరెస్స్ తో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జానారెడ్డి వంటి నేతలు చేస్తున్న “బీఆరెస్స్ – కాంగ్రెస్” ల పొత్తుపై రేవంత్ ఘాటుగా సూటిగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌, బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని.. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ ఎప్పుడో తేల్చి చెప్పారని క్లారిటీ ఇచ్చారు.

ఇక, బీఆరెస్స్ తో స్నేహాన్ని ధృతరాష్ట్ర కౌగిలితో పోల్చిన ఆయన… ఈసారి జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పైకి మూడు పార్టీల మధ్య పోటీగా కనిపించినా.. చివరకు మిగిలేది రెండు పక్షాలేనని, అందులో పైచేయి సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు!

PCC Chief Revanth Reddy Gives On Clarity On Congress Alliance With BRS Party | V6 News