Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ రద్దు… సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నానని రేవంత్ తెలిపారు. ఆ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడం కోసమే అక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ విషయంలో మాట మార్చారని తెలుస్తుంది. కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయబోతున్నామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కొడంగల్ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నానని తెలిపారు. అక్కడ యువతకు ఉపాధి కల్పించడం కోసమే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈయన తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం వర్గ ప్రజల అభివృద్ధి తన బాధ్యత అదే ప్రధానం సంకల్పం అని తెలిపారు.

సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదన్నారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ గురించి కూడా ఈయన మాట్లాడారు.

రైతుల నుంచి భూ సేకరణలో భాగంగా రైతులకు మరింత అధిక పరిహారం పెంచాలి అనే అంశం గురించి పునరాలోచన చేస్తామని తెలిపారు. ఇలా కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల దెబ్బకు రేవంత్ రెడ్డి మాట మార్చారు అంటూ బిఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.