తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న పథకాల ఫలాల సంబంధించిన రిపోర్టు రూపకల్పనపై వీరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ టీం పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను తెరాస నిలబెట్టుకోనున్నట్లు తెలుస్తోంది