అమెరికాలో నివాసముండే తెలంగాణ ఎన్ ఆర్ ఐ విజయకేసరి రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు. గతంలో కూడా ఆమె రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయ కేసరి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
“రేవంత్ రెడ్డి… నువ్వు బ్రోకర్ పనులు చేస్తావు… కేటిఆర్ గారిని బాత్రూమ్ లు కడిగినడు అంటున్నావు.. ఆయన ఉత్తగా మంత్రి కాలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, పోలీసుల చేతిల తన్నులు తిన్నడు… ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి మంత్రి అయ్యిండు. నీలాగా మందికి లంచాలు ఇచ్చి దొరకలేదు, బ్రోకర్ కాదు “ అంటూ ఆమె తీవ్ర పదజాలన్ని ఉపయోగించారు. విజయకేసరి రేవంత్ రెడ్డిని విమర్శించిన వీడియో కింద ఉంది చూడండి.