మునుగోడు ఉపఎన్నికలో టీ.ఆర్.ఎస్, బీజేపీ నేతల గెలుపు ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. పోటాపోటీగా ఈ రెండు పార్టీల నేతలు డబ్బులు పంచుతుండటంతో ఏ పార్టీకి ఓటెయాలో మునుగోడు ఓటర్లకు అర్థం కావడం లేదు. ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ అభ్యర్థి కేవలం 17 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారు. మరోవైపు డబ్బులు ఇచ్చినా అభ్యర్థి గెలవకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు కొంతమంది చిన్నస్థాయి నేతలు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ వస్తుండటంతో పార్టీ మార్చడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు కొంతమంది నేతలు డబ్బులు తీసుకున్న ఓటర్లు తమ పార్టీకే ఓటేస్తామని ప్రమాణం చేయాలని ఓటర్లను కోరుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో గెలవకపోతే తమ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే స్థాయిలో నేతలు ప్రవర్తిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
మునుగోడు ఉపఎన్నిక కోసం ఆ పార్టీ అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్, ఇతర పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలిచే అవకాశం తమ పార్టీలకు లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మునుగోడు ఎన్నికలో వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితులు లేవు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తమ పార్టీ ఓడిపోతుందని నేతలు భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రాదు.
మునుగోడు పార్టీలో ఓడిపోయినా ఆర్థికంగా పోటీ చేసిన నేతలకు ఏ మాత్రం నష్టం ఉండదని తెలుస్తోంది. రోడ్డు రోలర్ గుర్తు విషయంలో టీ.ఆర్.ఎస్ పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. రోడ్డు రోలర్ గుర్తు విషయంలో బీజేపీ కుట్ర చేసిందని టీ.ఆర్.ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.