సిద్ధిపేటలో హరీష్ రావు కు విచిత్ర మద్దతు (వీడియోలు)

టిఆర్ఎస్ కీలక నేత, ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు విచిత్రమైన మద్దతు లభించింది. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి సైతం ఈ తరహా అరుదైన మద్దతు లభించిన దాఖలాలు లేవనే చెప్పాలి. తీర్మానాలు, గీర్మానాలు అన్నది పాత మాట. కానీ నేడు హరీష్ రావుకు సిద్ధిపేటలో లభించిన మద్దతు చూసి జనాలు ఔరా అని ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఉంది. ఇంతకూ అంత గొప్ప మద్దతు హరీష్ ఎలా సంపాదించారు? ఆ మద్దతు కథేంటి? చదవండి.. వీడియోలు చూడండి.

 

సిద్ధిపేటలో హరీష్ రావు ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. పలు గ్రామాల్లో ఆయనకు ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఇబ్రహింపూర్ అనే గ్రామంలో హరీష్ కు బ్రహ్మరథం పట్టారు. దీంతో అక్కడ భావోద్వేగానికి లోనైన హరీష్ రాజకీయ సన్యాసం చేస్తానన్నట్లు మాట్లాడారు. తర్వాత గొంతు సవరించుకున్నారు. వాళ్ల అభిమానం తట్టుకోలేక అలా మాట్లాడినట్లు చెప్పుకున్నారు. ఇందులో వేరే ఉద్దేశం లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదని స్పష్టం చేశారు.

తాజాగా “మన ఓటు.. హరీష్ అన్నకే…టి ఆర్ ఎస్ కె .. హరీష్ అన్న లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి’’ అని నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఒక వ్యక్తి కొత్త స్టయిల్ ప్రచారాన్ని షురూ చేశారు.  ఉచితంగా జనాలకు రోడ్డుపైనే కటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ తరహా వినూత్న ప్రయోగం చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. 

‘‘సిద్దిపేట అంటే అభివృద్ధి… అభివృద్ధి అంటే హరీష్ అన్న రీతిలో సిద్దిపేట ప్రజలు చూపించే ఆదరణ.. అభిమానమే నిలువెత్తు సాక్ష్యం… సిద్దిపేట ప్రజలు కుటుంబంగా భావించే హరీశ్ అన్నకు… సిద్దిపేట కీర్తిని ఎల్లలు దాటించి హరీశ్ అన్నకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి అని… వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు… “

 

మా ఉపాధికి ఆర్థిక భరోసా కల్పించారు అని.. సిద్దిపేట లో యువ నాయ్ బ్రాహ్మణులు కొత్వాల్ శ్రీను తదితరులు హరీష్ అన్న లక్ష మెజారిటీ తో గెలవాలి అని.. గెలిచేంత వరకు సిద్దిపేట లో వృద్దులకు, చిన్న పిల్లలకు కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తామని హనుమాన్ నగర్ లో ఫ్లెక్సీ పెట్టి.. ఫుట్ పాత్ పై కటింగ్ చేయడం మొదలు పెట్టారు… ఇది ఈరోజే కాదు హరీష్ అన్న లక్ష మెజారిటీ తో గెలిచేంత వరకు అని…. అందరూ హరీష్ అన్న కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలవాలని అందుకు నావంతు గా ఉచితంగా కటింగ్ చేస్తున్నాను అన్నాడు.

ఈ సందర్భంగా స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి వారిని అభినందిస్తూ వారికి సంఘీభావం తెలిపారు.. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్, అడ్డగట్ల శేఖర్, పోశెట్టి శ్రీకాంత్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. చాలామంది జనాలు వచ్చి కటింగ్, గడ్డం చేయించుకుని కోత్వాల్ శ్రీను టీమ్ ను అభినందించి వెళ్తున్నారు. ఇది జిల్లాలో సంచలనం గా మారింది. 

వీడియోలు రెండు పైన ఉన్నాయి చూడండి.