మిర్యాలగూడలో టిఆర్ ఎస్ అభ్యర్ది నల్లమోతు భాస్కరరావు, నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా వారికి ఊహించని పరిణామం ఎదురైంది. మిర్యాలగూడ కాలనీల్లో ప్రచారం చేస్తుండగా కాలనీ యువకులు అడ్డుకొని సమస్యల పై నిలదీశారు.
ఇన్ని రోజులు రానిది ఇప్పుడెందుకు వచ్చారని ప్రశ్నించారు. నీళ్లు లేవు, రోడ్లు లేవు, మిర్యాలగూడలో అభివృద్దే లేదంటూ గుత్తాను నిలదీశారు. ఏం చేశారని ఓటు వేయాలో చెప్పాలన్నారు. మిర్యాలగూడ యువకులు అడిగిన ప్రశ్నకు భాస్కర్ రావు, సుఖేందర్ రెడ్డిలు గుట్కిలు మింగారు. సమాధానం చెప్పలేక సుఖేందర్ రెడ్డికి సల్ల చమటలు పట్టినయి. పోలీసోళ్లు యువకులను పక్కకు తప్పించడంతో వారు అక్కడి నుంచి చిన్నగా ముందుకు కదిలారు. యువకుడు ప్రశ్నించిన వీడియో కింద ఉంది చూడండి.