ఇబ్రహింపూర్ సభలో హరీష్ రావు సంచలన కామెంట్స్

సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహింపూర్ గ్రామంలో శుక్రవారం హరీష్ రావు పర్యటించారు. ఈ గ్రామాన్ని హరీష్ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ చదవండి.

ఈరోజు జరిగిన ఏకగ్రీవ తీర్మానం కలనా… నిజమా అన్నట్టుగా ఉంది. ఎన్నికలొస్తే నాయకులు ప్రజల చుట్టూ తిరుగుతారు, కానీ ప్రజలే నాయకులను పిలుపించుకుంటున్నారు. ఇబ్రహీంపూర్ ఒక అద్బుతం, ఒక దిక్సూచి. గ్రామం అంటే ఇబ్రహీంపూర్ లా ఉండాలి. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 10 అవార్డులు అందుకున్న గ్రామం ఇబ్రహీంపూర్. ఇది మీ ఐక్యతకు నిదర్శనం. అన్ని పల్లెలు ఇబ్రహీంపూర్ వైపు చూస్తున్నాయి.

టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలుస్తామంటేనే తెలంగాణ ఇచ్చామని ఆజాద్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం తెలంగాణ ఇచ్చిందా..? తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నరు. నాడు 1969 లో 369 మందిని పొట్టన పెట్టుకుని, తెలంగాణ ఎంపీలను కొని ఉద్యమాన్ని కాలరాసారు. కేసీఆర్ దీక్షా ఫలితం తెలంగాణ రాష్ట్రం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పారు.  ప్రతిసారీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు తిరగపడితే, కేసీఆర్ దీక్ష చేస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.

గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఇచ్చేవారా…గులాం నబీ ఆజాద్ సమాధానం చెప్పాలి. గులాం నబీ ఆజాద్ ప్రకటన కాంగ్రెస్ పార్టీ స్వార్ధాన్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటున్న కాంగ్రెస్, తెలంగాణ పరిస్థితి ఏంటో చెప్పాలి. రాహుల్ గాంధీ ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇస్తా అంటే తెలంగాణ ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు. పోరాటాల గడ్డ, తెలంగాణ గడ్డ. కాంగ్రెస్ వాళ్ళను తెలంగాణ ప్రజలు నమ్మరు. చంద్రబాబు తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణ కు ద్రోహం చేయడమే. ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయండి.
నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన గ్రామం ఇబ్రహీంపూర్. గత ఎన్నికలలో 18,500 రుపాయలు ఇచ్చి నన్ను గెలిపించారు. చరిత్ర పుటల్లో మరోసారి నిలిచింది ఇబ్రహీంపూర్ గ్రామం. ఈ ప్రేమతోనే రాజకీయల నుండి విరమించుకుంటే భాగుండు అనిపిస్తుంది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. రాజకీయాలలో ఉన్నా లేకున్నా మీ రుణం తీర్చుకుంటా.

తెలంగాణ ను ఎవరు తెచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ, తెచ్చామని టీఆరెస్ పార్టీ ఎన్నికలకు పోతే ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో అందరికి తెలుసు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రాజెక్ట్ లను అడ్డుకుంటున్న చంద్రబాబు తో కాంగ్రెస్ పార్టీ అంట కాగుతున్నది. గులాంనబీ ఆజాద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే. విభజన చట్టంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్.