లవ్ ఎన్ జి కె ఎల్… ఒకసారి పొయ్యొద్దామా ?

తెలంగాణ స్వరాష్ట్రంలో టూరిస్ట్ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం లెక్కలేనంత డబ్బు ఖర్చు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన షూటింగ్ స్పాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి వాటి అభివృద్ధి పై దృష్టి సారించింది. 

లవ్ హైదరాబాద్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ట్యాంక్ బండ్ మీదున్న లవ్ స్పాట్. మరి అటువంటి తరహాలోనే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో లవ్ ఎన్ జి కె ఎల్ ను ఏర్పాటు చేశారు. వెనుకబడ్డ పాలమూరు ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూలు చెరువు మీద లవ్ ఎన్ జి కె ఎల్ ను అభివృద్ధి చేశారు.

నాగర్ కర్నూలు మిని ట్యాంక్ బండ్ వద్ద కొలువుదీరిన బుద్దుడు

 

నాగర్ కర్నూలు జిల్లాలో పర్యాటకులను ఈ LOVE NGKL ఎంతగానో ఆకర్శిస్తున్నది. తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దీన్ని డెవలప్ చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారని స్థానికులు అంటున్నారు.ఈ నాగర్‌కర్నూల్ మినీ టాంక్ బండ్ కొత్త అందానికి నెలవైంది. 

సుందరంగా ముస్తాబవుతున్న నాగర్ కర్నూలు మిని ట్యాంక్ బండ్

ఇప్పటికే నాగర్ కర్నూలు చెరువులో బుద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే మినీ ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్స్ పార్క్, బతుకమ్మ ఘాట్ ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రజలను ఆకట్టుకుంటుంది లవ్ ఎన్ జి కె ఎల్.

తాజాగా మినీ ట్యాంక్ బండ్ వద్ద LOVE NGKL లోగో ఏర్పాటు చేయబడింది. జనాలు ఇక్కడికి వచ్చి ఈ లోగో వద్ద ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్‌కర్నూల్ అభివృద్ధే ధ్యేయంగా చేస్తున్న కృషికి మినీ టాంక్ బండ్ మచ్చుతునకగా మిగిలిందని స్థానికులు అంటున్నారు. 

లవ్ హైదరాబాద్ వలే లవ్ నాగర్ కర్నూల్

15 కోట్ల రూపాయలతో చేపడుతున్న చెరువు దసరా నాటికి సుందరంగా ముస్తాబవుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ టాంక్ బండ్, సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ తరహా నిర్మాణాలతో రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందేలా జరుగుతున్న పనులు ఇక్కడ జరుగుతున్నాయి. 

ఇది లవ్ హైదరాబాద్

కందనూలు కేసరి సముద్రం చెరువు ఇలా అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించని ప్రజలకు చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తోంది. పర్యాటకంగానూ ప్రజలను ఆకట్టుకుంటోంది. శ్రీశైలం పోయేటప్పుడో, వచ్చే టప్పుడో వీలైతే లవ్ ఎన్ జి కె ఎల్ కూడా వచ్చిపోండ్రి అని స్థానికులు రిక్వెస్ట్ చేస్తున్నారు. 

నాగర్ కర్నూలు మిని ట్యాంక్ బండ్ తాలూకు మరిన్ని చిత్రాలు కింద చూడండి.