ఏపీ ప్రత్యేక హోదా : టవర్ ఎక్కిన వ్యక్తికి రేవంత్ రెడ్డికి లింక్ ఏంటి??

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ శుక్రవారం ఢిల్లీలో సెల్ టవర్ ఎక్కాడు ఒక తెలంగాణ యువకుడు. లేదంటే కిందకి దూకేస్తానంటూ బెదిరించాడు. మెట్రో భవన్ కి దగ్గరలో ఉన్న సెల్ టవర్ ఎక్కిన ఆ యువకుడు ఏపీ నీడ్ స్పెషల్ స్టేటస్, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్స్ తెలియజేసాడు. స్థానిక పోలీసులు అతనికి నచ్చజెప్పి భారీ క్రేన్ సహాయంతో కిందకు దించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

టవర్ ఎక్కిన యువకుడు ఎవరో కాదు రేవంత్ రెడ్డి అనుచరుడు బందం ఉమేష్ రెడ్డి. రేవంత్ కి వీరాభిమాని. రేవంతన్న జనసైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు.

వరంగల్ వాస్తవ్యుడైన ఉమేష్ గతంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ హైదరాబాద్ లీడర్ గా వ్యవహరించాడు. వైజాగ్ డిఫెన్సె అకాడెమీలో విద్యను అభ్యసించాడు. రేవంత్ రెడ్డికి సంబంధించిన పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాడు ఉమేష్ రెడ్డి.

తన తండ్రి పద్మారెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నారు. తన సోదరుడు అనిల్ రెడ్డి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జయశంకర్ డిస్ట్రిక్ట్ లీడర్. వీరిది రాజకీయ నేపధ్య కుటుంబమని తెలుస్తోంది.