డిల్లీ పెద్దల మదిలో  రేవంతే.. ! 

రేవంత్ రెడ్డి అంటేనే ఒక  ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం  తెలంగాణాలో కేసిఆర్ కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్న ఏకైక నాయకుడు. పైగా ఫాలోయింగ్ లో ఓ స్టార్ హీరో రేంజ్ లో  అభిమనులు కలిగిఉన్న రాజకీయ నాయకుడు కూడా. అన్నిటికీ మించి  రేవంత్ చాల కిందస్థాయి నుండి వచ్చిన వ్యక్తి. గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ జడ్పిటిసి గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న  రేవంత్ జర్నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరుగా, ఏ పార్టీలో ఉన్నా  క్రియాశీల వ్యక్తిగా రేవంత్ కి మంచి గుర్తింపు ఉంది. అందుకే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కే ఇవ్వాలని కిందస్థాయి నాయకుల ఆరాటం.  
 

అందుకు తగ్గట్లుగానే రేవంత్ కూడా రేస్ లో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తూనే.. పిసిసి చీఫ్ కోసం తన రాజకీయాలు తానూ చేసుకుంటున్నాడు.  అయితే పిసిసి అధ్యక్ష నియామకం అన్న ప్రతీసారి రేవంత్ కు వద్దని కొందరు నాయకులు బలగుద్ది మరి వ్యతిరేకిస్తున్నారు. ఇది పసిగట్టిన రేవంత్, పార్టీలో తనదైన గ్రూపును బలంగా తయారు చేసుకునే పనిలో పడ్డారట. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో లాబీయింగ్ ముఖ్యమని, తనను సపోర్ట్ చేసే కీలక నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలోనే షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యనాయకులందర్నీ రేవంత్ తన వైపుకు తిప్పుకునే  పనిలో ఉన్నాడు.    

కానీ, కొంతమంది  సీనియర్లు మాత్రం పదవి తమకు  రాకపోయినా పర్వాలేదు, ఎట్టిపరిస్థితుల్లోనూ రేవంత్ కి పదవి ఇవ్వొద్దు అంటూ  వరుసకట్టి ఢిల్లీకెళ్లి రేవంత్‌ పై పిర్యాదులు చేస్తున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే ఉన్న ఏకైక మార్గం బలమైన నాయకుడు కావాలని అధిష్టానం ఫీల్ అవుతుంది.   ఢిల్లీలో రాహుల్ కోటరీకి అత్యంత సన్నిహితుడిగా రేవంత్  మారారు. అందుకే  పార్టీ పగ్గాల్ని రేవంత్ కే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు డిల్లీ పెద్దలు.  మొత్తానికి రేవంత్ పదవి కోసం  ఎంత చేయాలో  అంత చేస్తున్నాడు.