KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ తెలంగాణ సర్కారు తీర పట్ల అలాగే కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన మాట్లాడుతూ తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కాదని బండి సంజయ్ కూడా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణ భవన్‌లో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యి తమ పార్టీ నాయకులకు దిశా నిర్దేశాలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. పదవీ త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 14ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తే.. ఎందరో బలిదానాల వల్ల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
రాజకీయం అన్న తర్వాత ఎత్తు పల్లాలు సహజం అనుకోకుండా అడ్డమైన అపద్దపు హామీలను చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోకి వెళ్లిన ఎవరి పాలన బాగుందని ప్రశ్నిస్తే నిర్మొహమాటంగా కెసిఆర్ పాలన బాగుందని సమాధానం చెబుతారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేర్చలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు, అరాచకం బయట పెడతాం.. ఎవరికీ భయపడేది లేదు. భారాసను ఏమీ చేయలేరు. అన్నీ రాసుకుంటున్నాం.. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా ప్రతి ఒక్కరికి అన్ని తిరిగి చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకట్లు కమ్ముకున్నాయని చీకటికి వచ్చినప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది అంటూ కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.