KTR: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ఏ చిన్న అవకాశం దొరికిన అరెస్టు చేస్తూ జైలుకు పంపిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ విధంగా ఈ ఇద్దరు బిఆర్ఎస్ నేతలను పోలీసులు ఒకేసారి విడివిడిగా అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నేతల అరెస్టు పట్ల కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఈయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ సూట్ కేసులు మీకు.. అరెస్టులు మాకు అంటూ తీవ్రస్థాయిలోకి మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. మీ పాలనలో లోపాలను గుర్తుచేసిన అరెస్టులే అంటూ ఈయన మండిపడ్డారు.
మీ ప్రభుత్వ హయాంలో గురుకులాలలో చదివే విద్యార్థులు ఎన్నో అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఎంతోమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అయితే గురుకులాలను పరిశీలించిన కూడా కేసులే. పచ్చని పంటలు పండే పొలాలను ప్రభుత్వం లాక్కుంటున్న వాటికి ఎదురుపడిన కేసులే అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అలాగే బిఆర్ఎస్ నేతలపై పెడుతున్న కేసుల గురించి అరెస్టుల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం హరీష్ రావు, కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !
పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !
పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !
గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !
ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…
— KTR (@KTRBRS) December 5, 2024