KTR: కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం… మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు?

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్ రేసు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ తెలంగాణ సర్కార్ ఈయనపై ఆరోపణలు చేస్తూ ఏకంగా ఏసీబీ కేసును కూడా నమోదు చేశారు. ఇక ఈ కేసు విషయంలో కేటీఆర్ తప్పకుండా అరెస్టు అవుతారంటూ ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ నేతలు మంత్రులు వెల్లడించారు అయితే తాజాగా మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు సైతం కేటీఆర్ అరెస్టు గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా హరీష్ రావు హైదరాబాద్ లోని నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమంగా కేసులు పెట్టిన వదిలిపెట్టేది లేదు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, కుట్రలు, అక్రమ కేసులతో మేం తగ్గుతామని రేవంత్ అనుకుంటున్నారు. మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. ఈ కేసు విషయంలో కోర్ట్ఏసీబీని కేసు విచారణ కొనసాగించాలని చెప్పింది. అంతేగానీ ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి చేసిందని చెప్పలేదని తెలిపారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదికి కేటీఆర్ పై కేసు పెట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని హరీష్ రావు గుర్తు చేశారు. కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో పక్కదోవ పట్టించడం కోసమే ఇలా కేటీఆర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని హరీష్ రావు మండిపడ్డారు.

ఇలా ప్రజలందరూ ఆరు గ్యారెంటీ ల గురించి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఈయన ప్రతినెల ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ అందరిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తారని మాకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి కేటీఆర్ మాత్రమే కాకుండా మరి కొంతమంది బిఆర్ఎస్ నేతలను కూడా రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తారని తెలుసు. అయినా తాము ఇలాంటి అరెస్టులకు భయపడమని తెలియజేశారు. నోట్ల కట్టలతో ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పేరు పెంచే పనిచేసిన కేటీఆర్ పై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమే. ఎన్ని కేసులు పెట్టిన వెనక్కి తగ్గమని హరీష్ రావు తెలిపారు