KTR: ఇదొక లొట్టపీసుకేస్ అని నాకు తెలుసు… అయినా విచారణకు వెళ్లాను… కేటీఆర్ షాకింగ్ అ కామెంట్స్!

KTR: ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను లాయర్లను తీసుకొని విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి భయపడ్డారని అందుకే లాయర్లకు అనుమతి లేదు అంటూ అడ్డుకున్నారని తెలిపారు. ఇలా లాయర్లను అడ్డుకోవడంతోనే తాను వెను తిరిగి వచ్చేసానని తెలిపారు.

ఇలా ఫార్ములా ఈ రేస్ కేసు ఒక లొట్టపీస్ కేసు అయినప్పటికీ కూడా నేను బాధ్యతగల పౌరుడిగా విచారణకు హాజరయ్యాను.లాయర్ సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. హైకోర్టు అనుమతిస్తే ఈ నెల 9న లాయర్లతోనే ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. 16న ఈడీ ఎంక్వైరీకి వెళ్తానని తెలిపారు. అణాపైసా అవినీతి చేయని బిడ్డగా ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ నివాసం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా కూడా పచ్చగానే కనబడుతుంది అలాగే అవినీతి చేసేవారికి నోట్ల కట్టల బ్యాగులతో దొరికిన వారందరికీ కూడా అందరూ అలాగే అవినీతి చేసేవారిలా కనిపిస్తూ ఉంటారని ఏ పని చేసిన నోట్ల కట్లు చేతులు మారుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు.

ఫార్ములా -ఈ రేస్ విషయంలో ఏదో జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ, అదేమీ లేని లొట్టపీసు కేసు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కేసు పెట్టి చిట్టి నాయుడు పైసాచిక ఆనందం పొందుతున్నారని తెలిపారు. ఈ విషయంలో తాము ఎలాంటి అవినీతి చేయలేదు కనుక ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక న్యాయ వ్యవస్థ పై మాకు చాలా నమ్మకం ఉంది.

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో నాకేదో ఉరిశిక్ష పడినంత ఆనందాన్ని పొందుతున్నారని తెలిపారు. ఇక్కడ ఈ పిటిషన్ కొట్టివేయడంతోనే తాను సుప్రీంకోర్టుకు వెళ్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఈ కేసు విషయంలో ఎప్పటికీ న్యాయం ధర్మమే గెలుస్తుందని తెలిపారు. ఇక మిగిలిన నాలుగు సంవత్సరాలలో మాపై ఇంకా ఇలాంటి తప్పుడు కేసులు చాలా పెడతారని కేటీఆర్ తెలిపారు.