KTR: ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోందని చెప్పాలి. ఈ క్రమంలోనే హైకోర్టు ఈయనకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తనపై తప్పుడు కేసులు నమోదు అయ్యాయి అంటూ ఈ కేసులను కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటీషన్ విచారించిన కోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ అరెస్టు తప్పదని తెలుస్తుంది.
ఇలా కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంతో ఆయన అరెస్టుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పిందని తెలుస్తోంది. ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయొద్దు అంటూ తీర్పు ఇవ్వడం కుదరదని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ విషయంలో హైకోర్టు తెలంగాణ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది.
ఇలాంటి కేసుల్లో ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. చట్టం అందరికీ సమానమే అందరికీ రూల్ ఆఫ్ ల వర్తిస్తుంది అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించడంతో కేటీఆర్ కు తీవ్ర నిరాశ ఎదురయింది. ఇక హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో ఈయన ఇదే విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఈయనపై ఏసీబీ కేసులు నమోదు చేయించారు. అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదనీ, నాపై రేవంత్ డొల్ల కేసులు పెట్టారంటూ గతంలో రేవంత్ తీరుపై మండిపడ్డారు కానీ ఈ కేసు కొట్టి వేయాలంటూ ఈయన కోర్టును ఆశ్రయించడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగే ఉంటుందని అందుకే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.