KTR: కేటీఆర్ ముఖ్యమంత్రి అని కాస్త గుర్తించయ్యా…. అంత మాట అనేసావ్ ఏందీ?

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు వర్షం కురిపిస్తూనే ఉంటారు. తాజాగా ఈయన ముఖ్యమంత్రి అని కూడా లేకుండా రేవంత్ రెడ్డిని పట్టుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అయితే ఈ కేసు గురించి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడైతే.. తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లైవ్ డిబేట్ కు రెఢీ రావాలని కేటీఆర్ సవాలు విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్న కేటీఆర్.. ఈ కేసు విషయంలో తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఈయన తెలియజేయడమే కాకుండా రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు కురిపించారు.

ఇలా నువ్వు మగాడివైతే డిబెట్ కు రెడీ కావాలి అంటూ కేటీఆర్ సవాల్ విసిరడంతో ఈయన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో విచక్షణ కూడా కోల్పోతున్నారని పలువురు కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ గురించి ఏక వచనంతో ఎవరైనా మాట్లాడినా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇది ఆరంభం మాత్రమే. అసలు సినిమా ముందుంది అన్న ఆయన.. కాంట్రాక్టర్ మంత్రి పొంగులేటి.. బ్రోకర్ ముఖ్యమంత్రి రేవంత్.. అంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ బ్రోమర్ కావడంతో ఆయన కళ్ళకు అందరూ అలాగే కనపడుతున్నారని ఆయన ముఖ్యమంత్రి అయిన పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇంకా పోలేదు అంటూ తీవ్ర పరుష పదాలతో ముఖ్యమంత్రి పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.