7 న ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగ్రరూపం చూస్తారు…

 

కొంగరకలాన్ సభ ఫెయిలయిందని, అది తాగుబోతుల సభని, కెసిఆర్ పదవీవిరమణ సభ అని  రెండు రోజులుగా రోడ్డెక్కి అరుస్తున్న వాళ్లందరికి కెసిఆర్ సమాధానం చెప్పబోతున్నారు.  కొంగర కలాన్ సభకు 25 లక్షలు ప్రజలు రాలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతూ అదిఫెయిల్యూర్ సభ అనింది. కొంగరకలాన్ ఫ్లాప్ అని బిజెపి అంటున్నది. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా  కొంగర కలాన్  అది కెసిఆయర్ పదవీ విరమణ సభ అని తన వంతు రాళ్లేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు అది తాగుబోతుల సభ అన్నారు. రేవంత్ రెడ్డి, చిన్నా రెడ్డి కూడా కొంగరకలాన్ ఫెయిలయిందని రెండురోజులుగా ఒకటే గోల.  మరికొందరు కొంగరకలాన్ సభ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు మద్దతుగా జరిగిందని అన్నారు. ఇది బీరు, బిర్యానీ,బత్తా (బి3) మీటింగని వీడియో క్లిప్పింగుల  వైరల్ చెయించారు. కెసిఆర్ ప్రసంగం లో పసలేదని, ఎవ్వరినీ తిట్టకుండా కెసియార్ మాట్లాడటమేమిటని, కెసిఆర్ భయపడుతున్నారని అంటున్నారు. వాళ్లందరికి కెసిఆర్  మరొక మూడు రోజుల్లో తన ఉగ్రహ రూపం చూపించబోతున్నారు.

హుస్నాబాద్ లో ఈ నెల 7 న టీఆరెస్ అధినేత, సీ.ఎం కేసీఆర్ ప్రసంగానానికి మరొక బ్రహ్మాంఢమయిన సభ నిర్వహిస్తున్నారు.  ఈ సభకు కూడా భారీగా ఏర్పాట్లు జరగుతున్నాయి.  మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ఈ సభ మీద ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు పలు అంశాలపై చర్చించారు. ఈనెల 7 న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో జరుగు సీ ఎం కేసీఆర్ హాజరయ్యే భారీ సభకు 65 వేల మందిని సమీకరించాలని స్పష్టం నిర్ణయించారు. నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం నుండి 15 వేలు, ఎల్కతుర్తి నుండి 6 వేలు, భీమదేవరపల్లి నుండి 10 వేలు, అక్కన్నపేట్ మండలం నుండి 10 వేలు, కోహెడ మండలం నుండి 10 వేలు,  సైదాపూర్ మండలం నుండి 10 వేలు, చిగురుమామిడి మండలం నుండి 6 వేల మందిని సభకు తీసుకురావాలని నిర్ణయించారు.

 సభను జయప్రదం చేసేందుకు చిగురుమామిడి మండలానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, అక్కన్నపేట్ కు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, భీమదేవరపల్లి కి ఎమ్మెల్యే పుట్ట మధు, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి, ఎల్కతుర్తి కి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, హుస్నాబాద్ టౌన్, రూరల్ కు నీటిపారుదల మార్కెటింగ్ శాఖామంత్రి హరీష్ రావు హరీష్ రావు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, పాతురి సుధాకర్ రెడ్డి లు ఇంఛార్జి లుగా వ్యవహరించనున్నారు.

 ఈ మేరకు 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సభలో కెసిఆర్ తనను, పార్టీని, ప్రభుత్వాన్ని , కొంగర కలాన్ సభని విమర్శించిన వాళ్ల మీద నిప్పులు చిమ్ముతాడని, వాళ్లందరిని కడిగి వదిలేస్తారని ఈ రోజు సమావేశానికి హాజరయిన నాయకులొకరు చెప్పారు.

హుస్నాబాద్లో మధ్యాహ్నం 2 గంటల కు బహిరంగ సభ జరుగుతుంది. దీనికోసం హుస్నాబాద్ పట్టణ సమీపంలో ని పోతారం, పందిళ్ళ, కూచనపల్లి, మాలపల్లి, అరెపల్లి, హుస్నాబాద్ టౌన్, పోతారం, పొట్లపల్లి,  కొండాపూర్, నాగారం, ఉమ్మాపూర్, గాంధీనగర్ తదితర గ్రామాల నుండి పాదయాత్ర ల ద్వారా రావాలని పిలుపునిచ్చారు. దారి పొడువుననే  గిరిజన నృత్యాలు, మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఈ  సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.