కల్వకుర్తి టిఆర్ఎస్ లో డిష్యూం డిష్యూం (వీడియో)

కల్వకుర్తి టిఆర్ఎస్ లో డిష్యూం డిష్యూం (వీడియో)

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు మొల్ల మెల్లగా బయటపడుతున్నాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించి కక్ష తీర్చుకుంటున్నారు కొందరు నేతలు. నియోజకవర్గాల్లో జరుగుతన్న సమావేశాల్లో గొడవలు అందుకే జరుగుతున్నాయి.

జైపాల్ యాదవ్, కల్వకుర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే

తాజాగా కల్వకుర్తిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి చేదు అనుభం ఎదురైంది. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న జైపాల్ యాదవ్ ను ఓడించేందుకు మొన్నటి ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి కుట్రలు చేశారని కొందరు కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. 

కసిరెడ్డి నారాయణరెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ

వారి ఆగ్రహాన్ని చూసిన కసిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ సమయంలో కసిరెడ్డి మీద దాడి జరుగుతుండగా కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు జైపాల్ యాదవ్. కానీ వారు వినలేదు. కొందరు కుర్చీలు లేపి విసిరారు. దీంతో పోలీసులు కలగజేసుకుని కసిరెడ్డిని అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

క కల్వకుర్తి టిఆర్ఎస్ లో వర్గపోరు తాలూకు వీడియో కింద ఉంది.