కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా.. బీజేపీ షాక్ ఇవ్వనుందా?

మరో రెండు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఎంత కష్టపడినా ఎన్నికల ఫలితాలు తెరాసకు అనుకూలంగా రానున్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైతే కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి తప్పు చేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెరాస నేతలు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి దక్కిన హామీలు సైతం నెరవేరతాయో లేదో చెప్పలేమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీ సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ ను పట్టించుకోదు.

అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం కూడా బీజేపీకి మైనస్ కానుందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇవ్వనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైతే ఓటమి గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బీజేపీకి సైతం తెలంగాణలో షాకులు తప్పవని తెలుస్తోంది. బీజేపీ ఉపఎన్నికలపై శ్రద్ధ పెట్టడానికి బదులుగా సమర్థవంతమైన నాయకులకు అవకాశం ఇచ్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుండటం గమనార్హం.