కాంగ్రెస్ ఒంటేరు పై హరీష్ రావు సీరియస్ (వీడియో)

కాంగ్రెస్ గజ్వేల్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హారీష్ రావు ఫైర్ అయ్యారు. ఆధారాలు ఉంటే ఒంటేరు చూపించాలన్నారు. ఒంటేరు చేస్తున్న జిమ్మిక్కులు నడవవన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న ఒంటేరు అంతు చూసే వరకు తాను గజ్వేల్ నుంచి కదలనన్నారు.

గజ్వేల్ లో కేసీఆర్ గెలుపును రాహుల్ , సోనియాలే కాదు ఎవరి తాత జేజమ్మ వచ్చినా ఆపలేరని హరీష్ రావు అన్నారు.  ఒంటేరు చేసిన వ్యాఖ్యలపై చట్టరీత్యా చర్యలకు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని హరీష్ రావు తెలిపారు.

హరీష్ రావు తనకు ఆన్ నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి టిఆర్ ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదని, కేసీఆర్ ని ఓడించడానికి ఆర్ధిక సాయం కూడా చేస్తానన్నారని ఒంటేరు చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. ఒంటేరు డిపాజిట్ రాకుండా చేస్తానన్నారు. తాను బతికున్నంతకాలం మామ కేసీఆర్ తోటే ఉంటానని హరీష్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ను గజ్వెల్ లో ఓడిస్తేనే తెలంగాణలో కుటుంబ పాలన అంతం అవుతుందని హరీష్ తనతో అన్నట్లు ఒంటేరు మీడియాకు చెప్పడంతో రాజకీయ దుమారం రేగింది. టిఆర్ఎస్ లో తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ కలిసి తనను వెల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ చెప్పినట్లు ఒంటేరు వివరించారు.

ప్రైవేటు నెంబర్ తో (ఆ నెంబర్ తో ఫోన్ చేస్తే రికార్డ్ కాదు, నెంబర్ ట్రెస్ కాదు, ఆధారాలు దొరకవు) హరీష్ మాట్లాడినట్లు వంటేరు అన్నారు. తాను ఇది నిజమే అని ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేయడానికి రెడీ అన్నారు.

ఒంటేరు కామెంట్స్ పై హరీష్ నిప్పులు చెరిగారు. హరీష్ రావు మాట్లాడిన వీడియో కింద ఉండి చూడండి.

HARISHRAO FIRE ONTERU PRATAP REDDY