Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు కాస్త ఊరట కలిగింది. హైకోర్టు తీర్పుతో ఈయనకు ఉపశమనం కలిగిందని చెప్పాలి.తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మీద కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హై కోర్ట్ నిన్న కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
చక్రధర్ గౌడ్ తనపై రాజకీయ కక్షతో ఫిర్యాదు చేశారని…ఇది తప్పుడు కేసని హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతుకు ముందు ఈ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు డిసెంబర్ 30వ తేదీ వరకు ఈయనని అరెస్టు చేయటానికి వీలు లేదు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే తాజాగా డిసెంబర్ 30వ తేదీ మరోసారి విచారణ జరిపిన అనంతరం హైకోర్టు జనవరి 9వ తేదీ వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు అంటూ ఉత్తర్వులను జారీ చేశారు.
కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణను జనవరి 9కి వాయిదా వేసినట్టు కోర్టు ఉత్తర్వులను జారీ చేశారు. ఇక అప్పటివరకు ఈయనని అరెస్టు కూడా చేయటానికి వీలులేదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. మరి జనవరి 9 న మరోసారి విచారణ జరిపిన అనంతరం కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సింది.
ఇప్పటికే గత పది సంవత్సరాల ప్రభుత్వ హయామంలో ఎంతో మంది బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్కాములు చేశారని భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వరుసగా బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు.