Harish Rao: తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావును గురువారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన అరెస్టు కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించడం కోసం ఆయన ఇంటికి వెళ్లగా పోలీసులు హరీష్ రావును అరెస్టు చేసి సుమారు 12 గంటల పాటు జైలులో పెట్టారు.
హరీష్ రావు అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఇక ఈయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని తెలిపారు.తనను అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టిన హరీష్ రావు కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ రాజ్యంగ ఉల్లంఘన అంటూ కామెంట్ చేశారు. రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుందని ఈయన తెలిపారు. ఇక పోలీసులు రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించాలి ఇవి మాత్రమే శాశ్వతం కానీ, సీఎం పదవి శాశ్వతం కాదని తెలిపారు.
ఎఫ్ఐఆర్‌లు గాంధీ భవన్‌లో తయారవుతున్నాయని..పోలీసులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలని కాని..రేవంత్ రెడ్డి ఆదేశాలకు లోబడి పని చేయకూడదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదని రాక్షస పాలన కొనసాగుతుంది అంటూ తన అక్రమ అరెస్టు గురించి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా పోలీసులకు అలాగే రేవంత్ రెడ్డికి కూడా తనదైన శైలిలోనే వారిని ఇచ్చారు. హరీశ్‌రావు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావుపై ఆదివారం సిద్ధిపేటకు చెందిన ఓ రియల్టర్, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతోనే ఈయనని పోలీసుల అరెస్టు చేశారు.