Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ కోసం చేసిన ఖర్చు ఎంతో తెలుసా… ఆ డబ్బుతో ఓ ఇండియా సినిమానే చేయొచ్చు?

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో అభిమానులతో కలిసి అల్లు అర్జున్ సినిమా చూడటానికి తన కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో కలిసి వచ్చారు. అయితే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారనే విషయం తెలిసిన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక అల్లు అర్జున్ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా ఆయనని చూడటం కోసం అభిమానులు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ అభిమాని మరణించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అక్కడికి రావడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఆయన పర్మిషన్ లేకుండా వచ్చారు అంటూ పోలీసుల తనపై కేసు నమోదు చేసి తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లాయర్లు మొత్తం రంగంలోకి దిగారు ఇలా అల్లు అర్జున్ కు వెంటనే మద్యంతర బెయిల్ తీసుకువచ్చారు.

ఇక ఈయన బెయిల్ గడువు పూర్తి కావడంతో మరోసారి బెయిల్ పిటీషన్ వేయగా ఆ పిటీషన్ పై ఇటీవల విచారణ జరిగింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ బెయిల్ కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశారని తెలుస్తుంది మరి అల్లు అర్జున్ కోసం ఎంత ఖర్చు చేశారు ఏంటి అనే విషయానికి వస్తే ..ఒక్క రాత్రి కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యినట్టు టాక్. మొత్తం మీద ఈ వ్యవహారం లో అల్లు అర్జున్ టీం కి 5 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది.

ఇక అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఈయన కొన్ని రోజులపాటు సినిమాలన్నింటికీ పూర్తిగా దూరం ఉంటూ తన ఫ్యామిలీతో తన సమయాన్ని ఎంజాయ్ చేయనున్నారట అనంతరం తిరిగి ఆయన కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే.