గత మూడు రోజులుగా హైదరాబాదులోని జల్పల్లి లో మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలని దృష్టిలో ఉంచుకొని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంచు విష్ణు కి మంచు మనోజ్ కి నోటీసులు పంపించారు. ఆ నోటీసుకి అందుకున్న మనోజ్ బుధవారం నేరేడు మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమిషనర్ సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో నిర్వహించిన కోర్టు ముందుకు మంచు మనోజ్ వచ్చారు. స్థానికంగా ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.
పహడి షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పరిస్థితులు మరొకసారి నెలకొనకుండా ఉండాలంటే చట్టానికి లోబడి ఉండాలని మనోజ్ ను ఆదేశించారు. అలాగే మోహన్ బాబు ఇంటి పరిసరాలలో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించద్దని చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. కుటుంబ సమస్యలను సామాజిక సమస్యగా మార్చవద్దన్నారు. చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పారు.
దీంతో మంచి మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసిచ్చారు. దీంతో మంచు మనోజ్ ని పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు. ఇదే విషయం గా సిపి మాట్లాడుతూ మనోజ్ ని ఏడాది పాటు బైండోవర్ చేసినట్లు ఆయన నుంచి లక్ష రూపాయలు కూచికత్తు బాండు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండు ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు ఆరు నెలల్లో ఏదైనా నేరం చేస్తే పూచికత్తు గా ఇచ్చిన సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రెండుసార్లు కన్నా ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీ షీట్ తెరుస్తారు. మరి మనోజ్ బైండోవర్ కి కట్టుబడి ఉంటాడో లేదో చూడాలి.