Revanth Reddy: ఓటుకు నోటు కేసులో భాగంగా గతంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే అయితే తాజాగా మరోసారి ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఈడి ఆదేశాలు జారీ చేసింది.ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెండు నెలల సమయం కావాలన్న నిందితుల విజ్ఞప్తిని నాంపల్లి ఈడీ కోర్టు జడ్జి రమేశ్ తిరస్కరించారు.
ఈ కేసు విషయంలో తదుపరి విచారణ జనవరి 10వ తేదీ జరగనుంది అయితే ఈ విచారణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకావాలని జడ్జ్ రమేష్ తీర్పు వెల్లడించారు.నాంపల్లి ఈడీ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహా (ఏ2), జెరూసలేం మత్తయ్య (ఎ4), సండ్ర వెంకటవీరయ్య (ఎ7) మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.
ఇక ఈ విచారణకు వేంకీర్తన్‌రెడ్డి గైహాజరు కావడంతో
గైర్హాజరీ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో వేంనరేందర్‌రెడ్డి కుమారుడు వేంకీర్తన్‌రెడ్డి పేరును కేసులో నుంచి తొలగించాలని ఇటీవల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈడీ న్యాయ స్థానం విచారణ ప్రారంభించాలని జెరుసలేం మత్తయ్య తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. ఇలా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పినప్పటికీ ఈ పిటిషన్ కూడా కొట్టి వేసిన దీంతో జనవరి 10వ తేదీ జరగబోయే విచారణకు రేవంత్ రెడ్డి కూడా హాజరుకావాల్సి ఉంటుంది.
ఇలా ఓటుకు నోటు కేసు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ని వెంటాడుతుంది అయితే కోర్ట్ ఇలాంటి ఉత్తర్వులు వెల్లడించడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానులే అంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.